తిరుమలలో కొత్త రూల్స్ నవంబర్ 1 నుండి అమలు...Tirumala New Rules From 1St November
తిరుమలలో కొత్త రూల్స్ నవంబర్ 1 నుండి అమలు...
ఎవరైనా తిరుమల దర్శనానికి నవంబర్ 1 తరువాత కానీ ఒకటి నుండి కానీ దర్శనానికి వెళ్లాలనుకుంటే ఈ విషయం తప్పక తెలుసుకోండి.. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నవంబర్ 1 నుండి కొత్తగా రూల్స్ పెట్టడం జరిగింది. నవంబర్ 1 నుండి సర్వదర్శనం టోకెన్లు తీసుకునే కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది అలా అయితేనే దర్శనం చాలా త్వరగా అవుతుంది లేకపోతే చాలా ఆలస్యం అవుతుంది.. ఇంతకుముందు టోకెన్లు ఇచ్చే పద్ధతి వలన చాలామందికి ఇబ్బంది కలగడం వలన కొండ కింద టోకెన్లు తీసుకునే పద్ధతి అనేది మార్చి ప్రతి ఒక్కరిని కొండపైకి తీసుకువెళ్లడం జరిగింది.. అలా చేయడం వల్ల దర్శనానికి 48 గంటలు 24 గంటలు సమయం పట్టడం వలన ఇంతకుముందు లాగానే ఇప్పుడు కూడా కొండ కిందనే టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది... ఏ రోజుకి ఆరోజు దర్శనం టికెట్లు ఇస్తారు.. ఆ టికెట్లు మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఇస్తారు అంటే ఒకరోజు 25,000 ఒకరోజు 10,000 ఒకరోజు ఇస్తున్నారు.. టోకెన్లు అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేసేస్తారు.. ఒకవేళ మీరు తీసుకునే టైంకి కౌంటర్ క్లోజ్ అయిపోతే మీరు మామూలుగా తిరుమల వెళ్ళిపోయి అక్కడ ఉన్న వైకుంఠయుగ కాంప్లెక్స్ కి వెళ్లి మీరు లైన్ లో నిలబడాలి..ఇదే తిరుమలలో అమలు పరుస్తున్న కొత్త రూల్... ఇక్కడ ఏరోజు ఎన్ని టికెట్లు ఇస్తున్నారో చూడండి.. శనివారం,ఆదివారం,సోమవారం,బుధవారం ఈ నాలుగు రోజులు 20 నుంచి 24 వేల టిక్కెట్లు ఇవ్వబోతున్నారు... ఆ తరువాత అంటే మిగిలిన రోజుల్లో మంగళవారం,గురువారం,శుక్రవారం లో 15,000వేల టికెట్లు ఇవ్వబోతున్నారు... ఈ టికెట్లు తీసుకుని మీరు కొండపైకి వెళితే దర్శనమైనది చాలా త్వరగా అవుతుంది... మనకి మూడు చోట్ల టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అవి ఏ ఎక్కడ అంటే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము,అదేవిధంగా రైల్వే స్టేషన్ వెనక ఉంటుంది అదే మనం గోవిందరాజు స్వామి సత్రం అని పిలుస్తాం.ఈ మూడు చోట్ల మనకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది... తప్పకుండా ఆధార్ కార్డులు అనేవి ఉండాలండి.ఆధార్ కార్డులు ఉంటేనే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది...