భక్తుల అధిక రద్దీ దృష్ట్యా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలి
– టీటీడీ విజ్ఞప్తి
ఆగస్టు 11 నుండి 15 వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమల కు రావాలని టీటీడీ కోరుతోంది.
వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీ తో పాటు పండుగ తో కూడ వరుస సెలవులు ఆగస్టు 19 వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీ ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో తిరుమల యాత్రికుల రద్ధీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది.
ఈ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. యాత్రికులు దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో మరియు క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సంసిద్ధత మరియు ఓపికతో రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది...
AGED, INFANTS AND DIFFERENTLY ABLED REQUESTED TO POST PONE THEIR PILGRIMAGE
As heavy pilgrim influx is being anticipated from this week end due to series of holidays starting from August 11-15, TTD has appealed to pilgrims to co-operate with the TTD and plan their darshan, accommodation well in advance.
Though the summer rush is receded, the week end rush coupled with festive holidays expected to continue till August 19.
More over, the auspicious month of Peratasi is also commencing from September 18 onwards and will last till October 17.
In view of this, TTD has appealed to senior citizens, differently abled, those with chronic diseases, parents with infants to plan their Tirumala pilgrimage after Peratasi month to avoid any sort of inconvenience.
The pilgrims will be allowed for darshan only in their specified time slots. Pilgrims have to come with preparedness and patience to wait for long hours in the compartments and in queue lines till their turn for Darshan.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI