వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం|ANNUAL TEPPOTSAVAMS COMMENCES

ANNUAL TEPPOTSAVAMS COMMENCES

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్ర‌వారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీలోకనాథం, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

ANNUAL TEPPOTSAVAMS COMMENCESANNUAL TEPPOTSAVAMS COMMENCES

ANNUAL TEPPOTSAVAMS COMMENCESANNUAL TEPPOTSAVAMS COMMENCES

ANNUAL TEPPOTSAVAMS COMMENCES 

The annual Teppotsavams in Tiruchanoor temple commenced on Friday evening.

The processional deities of Ammavaru and Sri Krishna Swamy took out a majestic ride on the serene waters of Padma Sarovaram between 6:30pm and 7:30pm.

Earlier in the afternoon, the utsava murties were rendered special Abhishekam in Sri Krishna Mukha Mandapam.

Temple DyEO Sri Lokanatham, EE Sri Narasimhamurty, Archaka Sri Babu Swamy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS