తిరుమల జూన్ నెల లో వెళ్లే వారు ముందుగా ఈ విషయాలు తెలుస్కుని వెళ్ళండి | Tirumala June Month Darshan Updates Rooms Special Darshan

tirumala udpates
తిరుమల జూన్ నెల లో వెళ్లే వారు ముందుగా ఈ విషయాలు తెలుస్కుని వెళ్ళండి. 

కొండపైన భక్తుల రద్దీ :

 సుమారు రెండు సంవత్సరాల తరువాత తిరుమల భక్తులతో నిండింది గోవిందా నామస్మరణతో మార్మోగుతుంది . ప్రస్తుతం కొండపైన భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 28వ తేదీన 89,318 , 29వ తేదీన 90,885 మంది భక్తులు దర్శనం చేసుకోగా 30వ తేదీన 74,823 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు . ప్రస్తుతం దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. శని ఆదివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వేసవి శెలవులు కావడం తో తమ పిల్లలను తీస్కుని స్వామి దర్శనానికి అధికా సంఖ్యలో వస్తున్నారు. 

వృద్దులకు వికలాంగులకు స్పెషల్ దర్శనాలు : 

తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పెషల్ దర్శనాలు పునరుద్దించారు. ముందుగా తిరుపతి లో దర్శనం టికెట్స్ ఇవ్వాలని భావించిన ప్రస్తుతం వృద్దులకు వికలాంగులకు ప్రతి రోజు 1000 టికెట్స్ ఇస్తున్నారు . ఈ టికెట్స్ టీటీడీ వారి సైట్ (https://tirupatibalaji.ap.gov.in) లో బుక్ చేసుకోవాలి . ప్రస్తుతం జూన్ నెలకు దర్శనం టికెట్స్ ఉన్నాయి జులై నెలకు ఇంకా విడుదల చెయ్యలేదు . వృద్ధుల కనీస వయస్సు 65 సంవత్సరాలు ఉండాలి . వారితో పాటు ఒకరిని తోడు తీస్కుని వెళ్ళవచ్చు.

300 రూపాయల దర్శనం టికెట్స్ :

తిరుమల దర్శనానికి 300 రూపాయల దర్శనం టికెట్స్ జూన్ నెలకు అన్ని బుక్ అయ్యాయి . ఈ టికెట్స్ ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి తిరుపతి లో కానీ తిరుమల లో కానీ అప్పటికప్పుడు ఇవ్వడం లేదు . ప్రసుతం జులై నెలకు ఆగష్టు నెలకు దర్శనం టికెట్స్ విడుదల చేశారు భక్తులు ఈ టికెట్స్ ను https://tirupatibalaji.ap.gov.in సైట్ లో బుక్ చేస్కోవచ్చు .

నడక దారి శ్రీవారి మెట్టు అలిపిరి :

చాలామంది భక్తులు అడుగుతున్న ప్రశ్న నడక దారి లో వెళ్ళడానికి టికెట్స్ అవసరమా ? నడక దారిలో వెళ్తే దర్శనం టికెట్స్ ఇచ్చేవారు కదా ఇప్పుడు ఇస్తున్నారా ? అని అడుగుతున్నారు . ప్రస్తుతం రెండు నడక దారులు శ్రీవారి మెట్టు అలిపిరి మార్గం రెండు కూడా తెరిచే ఉన్నాయి . అలిపిరి మార్గం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుంది . శ్రీవారి మెట్టు మార్గం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. భక్తులు దర్శనం టికెట్స్ లేకుండా కూడా మెట్ల మార్గం నుంచి కొండపైకి వెళ్ళవచ్చు. ప్రసుతం నడిచి వెళ్తుంటే ప్రత్యేక దర్శనమ్ టికెట్స్ ఇవ్వడం లేదు. 

సర్వదర్శనం రూల్స్ :

ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . మొన్నటివరకు  తిరుపతి లో ఇచ్చేవారు ఆ టికెట్స్ ఉన్నవారినే  కొండపైకి పంపించే వారు ప్రస్తుతం ఆ టికెట్స్ విధానం లేదు. దర్శనం టికెట్స్ లేకపోయిన అందరు  కొండపైకి వెళ్ళవచ్చు . ప్రసుతం కరోనా సర్టిఫికెట్ లు అడగడం లేదు.  తిరుపతి నుంచి కొండపైకి ఉదయం 3:30 నుంచి రాత్రి 11:30 వరకు  ఉంటున్నాయి

రూమ్స్ :

తిరుమల రూమ్స్ కావాలంటే ఆన్లైన్ లో కనీసం రెండు నెలల ముందే బుక్ చేస్కోవాలి . ప్రస్తుతం ఆగస్టు నెల వరకు రూమ్స్ బుక్ అయ్యాయి . తిరుపతి జూన్ నెలకు రూమ్స్ ఉన్నాయి. జులై నెలకు జూన్ 20వ తేదీన విడుదల చేస్తారు. ఆన్లైన్ లో రూమ్స్ లేనివారు తిరుమల కొండపైన CRO ఆఫీస్ దగ్గర కరెంట్ బుకింగ్ ఉంటుంది అక్కడ రూమ్స్ తీస్కోవచ్చు . 

తిరుమల అంగప్రదక్షిణ : 

తిరుమలలో అంగప్రదక్షిణ పునః ప్రారంభించారు. cro ఆఫీస్ దగ్గర గల యాత్రికన్ నివాస్ దగ్గర్లో అంగప్రదక్షిణ టికెట్స్ ఇస్తున్నారు . వారం లో గురువారం నాడు మాత్రమే టికెట్స్ ఇవ్వరు మిగిలిన అన్ని రోజులు టికెట్స్ ఇస్తారు . రోజుకు మధ్యాహ్నం 12 గంటలకు 750 టికెట్స్ ఇస్తారు . ఈ టికెట్ ఉచితంగా ఇస్తారు . అంగప్రదక్షిణ ఉదయం 3:30 కు ఉంటుంది అంగప్రదక్షిణ అయ్యాక దర్శనం ఉంటుంది . అంగప్రదక్షిణ పూర్తీ వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

tirumala updates, tirumala june month udpates tirumala information today tirumala udpates

Comments