వీరబ్రహ్మ సుప్రభాతం|Veera Brahma suprabhatam Telugu book download
ఈ సుప్రభాతము
శ్రీ వేంకటేశ సుప్రభాతమువలె శ్రీ వీరబ్రహ్మేశ్వరస్వామికిగూడ ఒక సుప్రభాతము ఉండవలయునన్న సంకల్పము బ్రహ్మముగారి మఠమున వ్యవహర్త (Agent) గా పనిచేయుచున్న శ్రీ బండికట్ల కోటీశ్వరశాస్త్రి గారిది. ఆ సంకల్పమును మఠాధిపతులగు శ్రీనివాస స్వాముల వారుగూడ అభినందించి ఆమోదించిరి. వారిరువురి ప్రేరణ కారణముగా నేనీ సుప్రభాతశ్లోక రచనమును గావించితిని.
ప్రభాత మనునది ప్రతిదినమును వచ్చునట్టిదే. దానిని సుప్రభాతముగా చేసికొనుట ఉత్తముల కర్తవ్యము. ప్రభాతకాలము భగవంతుని స్తోత్రమునకో, యోగ మంత్రా ద్యనుష్ఠానములతో వినియోగింపబడినచో సుప్రభాతము కాగలరు. భగవంతు నుద్దేశించిన సుప్రభాతము లన్నియు ఆ యుద్దేశ్యమును చరితార్థము చేయుటకే ప్రచలితము లయినవి.
నిద్రించుట, మేల్కాంచుట అనునవి ప్రాణిమాత్ర సాధారణ ధర్మ ములు భగవంతుని నిద్రా జాగరముల కర్ధము జగత్సృష్టి, జగత్ప్రళయ ములు మాత్రమే. ఆ భగవంతుడు మేల్కొన్నప్పుడు జగల్లీల ఇడచును; నిద్రించినప్పుడు జగత్తు ఆ శక్తిలో లీనమగును. మన నిద్రా జాగరములను బట్టి ఆ సర్వశక్తికిని వానిని ఆరోపించుచున్నాము.