Ekadasi Mahatmyam Telugu Book Download TTD eBooks Download
ఏకాదశీ మహాత్మ్యం
Author: Yamijala Padbhanabha Swami
Literature: TEMPLE LITERATURE
Language: Telugu
Year: 2006
ఏకాదశీ మాహాత్మ్యం
శ్రీమత్కళ్యాణమూర్తులు, జగజ్జననీ జనకులైన లక్ష్మీనారాయణులకు నమస్కారం.
పేరుకి అరణ్యమే గాని అది తపోధనులకు శరణ్యం. అదే నైమిశారణ్యం. పుణ్యానికి కుదురు. యజ్ఞయాగాదులకు సంబంధించిన వైదిక మంత్రాలకు ఆటపట్టు. సిద్ధులకూ సద్బుద్ధులకూ జన్మభూమి. ఆచారానికి పాదు. దురాచారానికి సవతి తల్లి. జపతపాలకు కల్పవల్లి. పాపాలకు భైరవ మంత్రం.
అలాటి నైమిశారణ్యమందు ఒకప్పుడు కణ్వుడు, శాండిల్యుడు, మాండవ్యుడు, కశ్యపుడు, గౌతముడు, మార్కండేయుడు, వశిష్ఠుడు మొదలైన బ్రహ్మవేత్తలు లోకక్షేమం కోసం ఒక యజ్ఞం చేస్తూ విశ్రాంతి సమయంలో శివకేశవులకు సంబంధించిన లీలలు చెప్పుకుంటూ ఉండగా ఒకనాడు వ్యాసభగవానుని శిష్యుడు పురాణకథా నికేతుడు సూతుడు వచ్చాడు.
Ekadasi Mahatmyam Telugu Book Download