శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ|Sri Prasanna Anjaneya Swamy Vari Devasthanam singarakonda

Sri  Prasanna Anjaneya Swamy Vari Devasthanam singarakonda

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం 

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం శింగరాయ కొండ గ్రామము నందు ప్రకాశం జిల్లా లో ఉంది. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. శ్రీవరాహ నరసింహ స్వామి వారి ఆలయం కొండ దిగువన భవనాశిని అనబడే చెరువు ఒడ్డున ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఉంది.ఇదిచాలా పురాతనమైన ఆలయం. ఈ స్వామి వారు గొప్ప శక్తిమంతునిగా పేరు పొందారు. ఈ స్వామి వారిని భక్తితో స్మరిస్తే ప్రసన్నులవుతారని నానుడి. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా దర్శించినంత మాత్రముననే భూత, ప్రేత, పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా మటుమాయమై అవుతాయని భక్తుల విశ్వాసం.

అభయ హస్తంతో శ్రీ ఆంజనేయ స్వామి భక్తులను ఆశీర్వదించడం ఇక్కడి ప్రత్యేకత. ఇచ్చట స్వామి వారు దక్షిణ ముఖుడై కనిపిస్తారు. దక్షిణ ముఖ హనుమంతుడు అపమృత్యువును హరిస్తాడని ప్రతీతి

ఇచ్చట ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. శ్రీరామ నవమి, హనమజ్జయంతి ఉత్సవాలు ఇచ్చట ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శని, ఆది. మంగళ వారాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామి వర్ణని దర్శిస్తారు.

క్షేత్ర చరిత్ర:

కొండపై శ్రీ వరాహ నరసింహ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో మహా తేజశ్చాలి అయిన ఒక మహాయోగి శింగరాయకొండ గ్రామానికి వచ్చి కొండ దిగువ భాగాన చెరువు గట్టున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించి వెంటనే అంతర్ధానమయ్యారు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, కొండపై నుండి ఈ అద్భుత లీలను చూచినవారు. కొండ దిగి వచ్చినవారికి ఆ మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగి పోతూ కనిపించింది. ఆ దివ్య తేజస్సుకు నమస్కరించి ఒక ఆలయాన్ని నిర్మించి పూజించారు.

ప్రతి ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ ఆలయం తెరచి ఉంటుంది.

స్థల పురాణము

 సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపధం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని ఒక నమ్మకం. అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు. అద్దంకి తాతాచార్యులు అని గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహ స్వామి గుడియంది ధ్వజారొహణ చేయుచుండగా, కొండ క్రింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చుచూ కనబడెను. పరుగు పరుగున క్రిందకు వెళ్ళిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై, దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది.

పూజలు 

సింగరకొండలో ప్రతి మంగళ వారం మరియు శని వారం విశేష పూజలు జరుగును. అటులనే, ముఖ్య పండుగలు అయిన ఉగాది, శ్రీరామ నవమి, హనుమ జ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, బ్రహ్మోత్సవాల తిరునాల్లు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజుల యందు లక్షల కొద్దీ భక్తులు వచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీశ్శులు పొందెదరు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష తమలపాకుల పూజ, కోటి తమలపాకుల పూజ చూడుటకు రెండు కళ్ళూ చాలవు.

శ్రీ సువర్చలాంజనేయస్వామి స్వామి చిత్రకృప : 

singarakonda devasthanam అభిషేకం - 6 AM - 7 PM - ప్రతిరోజూ 

దర్శనం, అర్చన, ఆకు పూజ - 7 AM - 12: 30 PM - ప్రతిరోజూ

 పంచ హారతి - 1 PM - 1:30 PM - ప్రతిరోజూ 

దర్శన్, అర్చన, ఆకుపూజ -2 PM - 7 PM - ప్రతిరోజూ 

ప్రదోషకలర్చన - 7 PM - 7:45 PM - ప్రతిరోజూ

 శాశ్విత అభిషేకం రూ. 500/- 6 AM- 7 AM - సంవత్సరంలో ఏరోజైనా 

నిత్యాన్నదాన పథకం 

స్వామివారిని దర్శించుకొనడానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాట్లు, 2001 నుండి హనుమజ్జయంతి సందర్భంగా మొదలు పెట్టినారు. ప్రతి మంగళవారం, శనివారం 150 మంది భక్తులకు, మిగతా రోజులలో 50 మంది భక్తులకు, అన్నప్రసాదవితరణ జరుగుచున్నది.

సమీప దర్శనీయ ఆలయాలు

అయ్యప్పస్వామివారి ఆలయం, షిర్డీ సాయిబాబావారి ఆలయం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం, శ్రీ గాయత్రీమాత ఆలయం, కొండపైనెలకొనియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం చూడదగ్గవి.

వసతి

సింగరకొండ లో వసతి పొందాలనుకునేవారు దేవస్థానం ఏర్పాటు చేసిన కాటేజీలలో బస చేయవచ్చు. కనుక ఇక్కడికి వచ్చే యాత్రికులు మమారుతి భవన్ లో వసతి పొందవచ్చు. అద్దె తక్కువ ధరకే లభిస్తుంది. ఈ భవన్ రెండు అంతస్తుల సముదాయం.

సింగరకొండ ఎలా చేరుకోవాలి ? 

ఎంత దూరం : హైదరాబాద్ నుండి 290 కిలోమీటర్లు, విజయవాడ నుండి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుండి 36 కిలోమీటర్లు, అద్దంకి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సింగరకొండ కలదు. 

విమాన మార్గం ద్వారా : సమీప విమానాశ్రయం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్. అక్కడ దిగి క్యాబ్ లేదా టాక్సీ లలో సింగరకొండ చేరుకోవచ్చు.

రైలు మార్గం : ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపాన ఉన్నది. హైదరాబాద్, విజయవాడ నుండి చెన్నై వెళ్ళే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్ళన్నీ ఒంగోలు స్టేషన్లో ఆగుతాయి.

రోడ్డు/ బస్సు మార్గం :  సమీప బస్ స్టాప్ - అద్దంకి. హైదరాబాద్, విజయవాడ, ప్రకాశం నుండి అద్దంకి కి బస్సులు కలవు. 

ఒంగోలు నుంచి: బస్సు ప్రయాణీకులు అద్దంకి వెల్లు బస్సు ఎక్కవలెను. అద్దంకి నుంచి సింగర కొండకు ప్రతి 30 నిముషములకి బస్సులు ఉన్నాయి. కారు ద్వారా వెళ్ళు యాత్రీకులు అద్దంకి నుంచి సింగర కొండ మార్గంలో వెళ్లవలెను.

HISTORY OF TEMPLE

Sri Prasannanjaneya Swamy Temple History

According to the history Sri Lakshminarasimha Swamy temple which is there on Singarakonda hill was built in 14th century, during the regime of King Devarayalu. There is an evidence of Sila Sashan written on the Garuda Stambham says that this temple was built during the year 1443-44. The following are the strong beliefs.

During the 14th century, Singanna a devotee of Lakshminarasimha Swamy used to live in a village near by the hill. His daughter named Narsamma used to take their cows for gazing on the hill. They observed that one of the cows was not giving milk for several days. To find out the reason, Singanna followed the cow secretly and observed that the cow went to a rock on the hill and stood. A boy came out of the rock and sucks the milk from the cow and disappeared. Singanna felt that his beloved God Sri Lakshminarasimha Swamy only came as a boy and took the milk from the cow. Singanna built the Sri Lakshminarasimha Swamy temple on the hill with this belief. Later on people started calling this hill as Singarakonda.

Around 210 years ago (end of 17th century), during the inauguration of Dwaja Stambham inthe premises of Sri Lakshminarasimha Swamy temple, thousands of devotees were witnessed that a Yogi installed Sri Prasannanjaneya Swamy idol at Bhavanasi tank below the Singarakonda hill and disappeared. The devotees started praying Sri Prasannanjaneya Swamy at Singarakonda.


Near By Famous Temples:

1.Sri Lakshmi Narasimha Swamy Temple, Singarakonda,Addanki Mandal, Prakasam Dt.

2. Sri Thrikoteswara Swamy Temple Kotappa Konda, Narasaraopet Mandal, Gutur Dt.

3. Tripuranta Keswara Swamy Temple.


Regular Sevas & Darsan Timings

MORNING TEMPLE DARSHANAM TIMINGS రోజు ఆలయ దర్శన వేళలు

07:00 AM - 01:00 PM


EVENING TEMPLE DARSHANAM TIMINGS ప్రతిరోజూ ఆలయ దర్శన వేళలు

03:00 PM - 07:00 PM


Pratyaksha seva moolavirat abhishekam Rs.1,000.00 (daily) మూలవిరాట్ అభిషేకం(రెగ్యులర్) రూ.1,000.00

05:45 AM - 07:00 AM


Pratyaksha Seva Moola Virat AakuPooja Rs.1,000.00 (daily) మూలవిరాట్ అభిషేకం (రెగ్యులర్ ) రూ. 1000.00 

07:30 AM - 12:30 PM


PRATYAKSHA SEVA GOTRA NAMARCHANA Rs.100.00 (daily) గోత్ర నామార్చన (రెగ్యులర్) రూ.100.00 

07:30 AM-01:00 PM


PRATYAKSHA SEVA VADAMALA SEVA Rs.1,116.00 (daily) వడమాల సేవ (రెగ్యులర్) రూ.1,116.00

11:00 AM - 01:00 PM


Pratyaksha Seva Panchaharathi Rs.1,000.00 (daily) పంచహారతి (రెగ్యులర్) రూ.1,000.00 

01:00 PM - 01:30 PM


Pratyaksha Seva Moolavirat Prodosha Kalarchana Seva Rs.1,000.00 (daily) మూలవిరాట్ ప్రదోష కాలాన (రెగ్యులర్) రూ.1,000.00

 07:00 PM - 07:45 PM


Pratyaksha Seva Mukha mandapa Aakupooja Rs.400.00 (daily) ముఖ మండప ఆకుపూజ (రెగ్యులర్) రూ.400.00

07:30 AM - 12:30 PM


Paroksha (Virtual) Seva Details

పరోక్ష సేవ: మూలవిరాట్ అభిషేకం (వర్చువల్ రూ.1,000.00 PAROKSHA SEVA: Moolavirat Abhiskekam Rs.1,000.00 (VARTUAL) 

Daily from 05:45 AM-07:00 AM


పరోక్ష సేవ: స్వామివారికి వడమాల సేవ రూ.1,116.00 (వర్చువల్) PAROKSHA SEVA: Swamivaari Vadamala Seva Rs.1,116.00 (VIRTUAL) 

Daily from 11:00 AM-01:30 PM


పరోక్ష సేవ: ముఖ మండప ఆకుపూజ రూ.400.00 (వర్చువల్) PAROKSHA SEVA: Mukha Mandapa Aakupooja Rs.400.00 (VARTUAL) 

Daily from 07:30 AM-12:30 PM


పరోక్ష సేవ: గోత్ర నామార్చన రూ.100.00 (వర్చువల్) PAROKSHA SEVA; Gotra Namarchana Rs.100.00 (VARTUAL) 

Daily from 07:30 AM-12:30 PM

Transport|రవాణా

By Road:

Nearest Bus station is Addanki, Buses from Hyderabad, Vijayawada, Ongole to Addanki are available.

ఆలయానికి దగ్గరగా అడ్డంకి బస్టాండ్ కలదు, హైదరాబాద్, విజయవాడ మరియు ఒంగోలు నుండి అడ్డంకి కి బస్సు సౌకర్యం కలదు.

By Train:

Nearest Railway station is Ongole. All express and Passenger trains passing from Ongole will halt in this station.

ఆలయానికి దగ్గరగా ఒంగోలు రైల్వత్ స్టేషన్ కలదు, అన్ని ఎక్స్ ప్రెస్ మరియు పాసెంజర్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి.

By Air:

Nearest Airport is Vijayawada International Airport at Gannavaram with a distance of 110 Km.

ఆలయానికి దగ్గరగా 110 కి.మీల దూరంలో గన్నవరంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Sri Lakshmi Narasimha Swamy Temple, Singarakonda, Addanki Mandal, Prakasam Dt.

సింగరకొండ పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం 14వ శతాబ్దంలో దేవరాయల పాలనలో నిర్మించినట్టు తెలుస్తుంది, దీనికి బలం చేకూరుస్తూ అక్కడి గరుడ స్థంభంపై గల శిలా శాసనాల ప్రకారం ఈ ఆలయం 14 43-44 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించినట్లు ఉంది.అలానే ఇంకా కొన్ని బలమైన కథనాలు ఇలా ఉన్నాయి. పరిశీలిస్తే ఈ దేవాలయం 14వ శతాబ్దం లో దేవ రాయలు అనే రాజు ఏలుబడిలో నిర్మితమై ఉండవచ్చునని తెలియుచున్నది. 14వ శతాబ్దంలో సింగరకొండ చెంత ఉన్న ఒక పల్లెటూరికి చెందిన సింగన్న అనే నరసింహ స్వామి భక్తుని కుమార్తె అయినా నరసమ్మ అ నే బాలిక తమ ఆవులను మేపేందుకు సింగర కొండ మీదకి తోలుకుని వెళ్ళేది. ఆవుల మందలో ఒక ఆవు చాలా రోజులుగా పాలు ఇవ్వకపోవడాన్ని గమనించిన సింగన్న ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక రోజు రహస్యంగా ఆవును వెంబడించాడు. ఆ ఆవు నేరుగా వెళ్లి కొండపైన ఉన్న ఒక శిల వద్ద ఆగింది. ఆ శిల నుండి ఒక బాలుడు ఉద్భవించి పాలు త్రాగి వెళ్లడం సింగన్న గమనించాడు. తాను పూజిస్తున్న నరసింహ స్వామి బాలుని రూపంలో వచ్చి పాలు త్రాగడాన్ని భక్తి భావాల తో నమ్మి ఇక్కడ ఆ లయంను నిర్మించాడు అని ఒక కథ ప్రచారం లో ఉంది.

According to the history Sri Lakshminarasimha Swamy temple which is there on Singa rakonda hill was built in 14th century, during the regime of King Devarayalu. There is an evidence of Sila Sashan written on the "Garuda Stambham" says that this temple w as built during the year 1443-44. The following are the strong beliefs.

During the 14th century, Singanna a devotee of Lakshminarasimha Swamy used to liv e in a village near by the hill. His daughter named Narsamma used to take their cows f or gazing on the hill. They observed that one of the cows was not giving milk for sever al days. To find out the reason, Singanna followed the cow secretly and observed that the cow went to a rock on the hill and stood. A boy came out of the rock and sucks th e milk from the cow and disappeared. Singanna felt that his beloved God Sri Lakshmin arasimha Swamy only came as a boy and took the milk from the cow. Singanna built t he Sri Lakshminarasimha Swamy temple on the hill with this belief. Later on people st arted calling this hill as Singarakonda.

Sri ThriKoteswara Swami Temple Kotappa Konda, Narasaraopet Mandal, Guntur Dt.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ గ్రామంలో త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రధాన దేవుడు త్రికోటేశ్వర స్వామి వారిని ఇక్కడ శివుని ప్రతి రూపంగా కొలుస్తారు. కోప్పప్పొ కొండ మొత్తం మూడు శిఖరాల ఎత్తు 1587 అడుగులు కాగా ఆలయం 600 అడుగుల ఎత్తులో నిర్మించబడింది.

ఈ మూడు శిఖరాలు శ్రీ బ్రహ్మ, విష్ణు, మరియు మహేశ్వరులను సూచిస్తాయి. ఇక్కడ శివుణ్ణి లింగం రూపంలో ప్రతిష్టించబడింది. ఆలయాన్ని చేరుకోవడానికి 750 మెట్లు నిర్మించబడ్డాయి. అనేక సరస్సులు, కొలనులు కొండపై మరియు ఆలయానికి ముందు చూడవచ్చు.

Trikoteshwara Swamy Temple is nestled in Kotappakonda village of Guntur district in A ndhra Pradesh. The main deity Lord Shiva is worshipped here as Shri Trikoteshwara S wamy. The height of three peaked Kotappakonda hill is 1587 feet and the temple is co nstructed at the height of 600 feet. These three peaks represent Lord Brahma, Lord Vi shnu, and Lord Mahesh.

Here, Lord Shiva is established in the form of shiva lingam. A steep flight of 750 steps leads to the temple. A number of lakes, ponds can be seen on the hill and in front of t he temple.

Tripuranta Keswara Swamy temple

మార్కాపురం నుండి 40 కి.మీ. మరియు ఒంగోల నుండి 93 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది ఒక ప్ర సిద్ధ పుణ్యక్షేత్రం. కొండ మీద త్రిపుర కేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. ఇక్కడ విగ్రహం గంగా భవాని చిత్రంతో సహా 5 ముఖాలు కలిగిన లింగ రూపంలో ఉంది. పురాణాల ప్రకారం, అగస్త్యుడు అనే మహారాజు ఇ క్కడ ఒక గుహను నిర్మించాడు. ఇది శ్రీశైలం, రామేశ్వరం మరియు కాశీలకు దారితీస్తుంది.

Located at 40 km from Markapuram and 93 km from Ongole, it's a well-known place o f pilgrimage. This is the site of the Tripuranta Keswara Swamy temple situated on a hill top. The main idol is in the form of a linga with 5 faces, including the image of Ganga Bhavani. According to mythology, Agasthya Maharaj built a cave here that leads to Sri salam, Rameswaram and Kashi.

Contact Numbers and information

Sri Prasanna Anjaneya Swamy Vari Devasthanam,

Singarakonda village,

Addanki (Mandal),

Prakasam (District),

Andhra Pradesh-523 201

Phone: 9491000733

Popular post to download:

pothana bhagavatam free downloadmahabharatam books free downloadTelugu Book Downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

ALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gita

More Books:

keywords:Sri  Prasanna Anjaneya Swamy Vari Devasthanam singarakonda photos download, Sri  Prasanna Anjaneya Swamy Vari Devasthanam singarakonda,Sri  Prasanna Anjaneya Swamy Vari Devasthanam singarakonda charitra telugu lo,Sri  Prasanna Anjaneya Swamy Vari Devasthanam singarakonda timings,SSri  Prasanna Anjaneya Swamy Vari Devasthanam singarakonda jeevitha charitra,Sri  Prasanna Anjaneya Swamy Vari Devasthanam singarakonda temple history telugu.Telugu popular books download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri mukundamala PDF download,shiva Mahapuran PDF download,mukapanchasathi pdf download,sri Gayatri anushthan prakashika PDF download

Comments